ఏపీకి కొత్త గవర్నర్.. కేంద్రానికి లేఖ..!


గత కొద్దిరోజులుగా తెలుగు ఉమ్మడి గవర్నర్ విషయంలో చర్చలు జరుగుతూ ఉన్న సంగతి తెలసిందే కదా. ముఖ్యంగా ఏపీ నేతలు తమ రాష్ట్రానికి గవర్నర్ కావాలన్న ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు. న‌ర‌సింహ‌న్ తీరు స‌రిగా లేద‌నీ, తెలంగాణ ప‌క్ష‌పాతిగా వ్య‌వ‌హ‌రిస్తూ.. తెలంగాణ రాష్ట్రానికి వత్తాసు పలుకుతూ.. ఏపీ పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్నారంటూ నరసింహన్ మీద మండిపడుతున్నారు. తమకు కొత్త గవర్నర్ కావాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు, ఎంపీ కంభంపాటి హ‌రిబాబు కేంద్రానికి రాసిన లేఖ రాశారు. దీంతో... సొంత పార్టీ నుంచే ఫిర్యాదు రావడంతో ఈ లేఖను కేంద్రం సీరియస్ గా తీసుకుందని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నరసింహన్ కి బరువు తగ్గించే యోచనలో వున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కి కొత్త గవర్నర్ ఎంపిక దాదాపు పూర్తయినట్లేనని, వారంపది రోజుల్లో ప్రకటన వెలువడవచ్చని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో...గవర్నర్ గా కేంద్రం ఎవరిని నియమిస్తుందో... చూడాలి.