పోక్సో కేసులో విజయవాడ పోలీసుల విచారణకు గోరంట్ల
posted on Mar 6, 2025 2:02PM
వైకాపా నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం విజయవాడ పోలీసుల విచారణకు హాజరయ్యారు. పోలీసులు పది ప్రశ్నలను గోరంట్ల మాధవ్ ముందు పెట్టారు. వాటి సమాధానాలను పోలీసులు స్టేట్ మెంట్ రూపంలో తీసుకున్నట్టు సమాచారం. ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం అత్యాచార బాధితుల వివరాలను గోప్యంగా ఉంచాలి. కానీ మాధవ్ అత్యాచార బాధితుల పేర్లను బయటపెట్టారు. పోక్సో క్రింద మాధవ్ పై గత ఏడాది నవంబర్ 2న వాసిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తమ విచారణకు హాజరు కావాలని విజయవాడ పోలీసులు మాధవ్ కు నోటీసులు పంపించారు. మాధవ్ విచారణకు హాజరయ్యారు. పోలీసు విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని గోరంట్ల మీడియాతో చెప్పారు