ఎంపీ అబ్రివేషన్ నే మార్చేశారు.. గోరంట్ల మాధవ్ వ్యవహారంపై జస్పీర్ సింగ్ గిల్

న్యూఢ్ వీడియో కాల్ విషయంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కాపాడేందుకు  ఏపీ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు  చేస్తున్నా
విచారణే జరపకుండా పోలీసులు గోరంట్ల మాధవ్ కు మీడియా సమావేశం పెట్టి మరీ క్లీన్ చిట్ ప్రయత్నం చేసినా… అవన్నీ  ఏ మాత్రం ఫలించలేదు.  గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఢిల్లీ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ పరువును నిలువునా తీసేసింది.

వైసీపీ సర్కార్ నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కాంగ్రెస్   ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ … లోక్‌సభ స్పీకర్, మహిళా కమిషన్ చైర్ పర్సన్, ప్రధాని మోడీలకు గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారు.  గోరంట్ల మాధవ్ తీరుతో పార్లమెంటు పరువు రోడ్డున పడినట్లైందనీ, పార్లమెంటు సభ్యులకు  ఎంపీలకు మాయని మచ్చలామారిందనీ అన్నారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. గోరంట్ల మాధవ్ తన ఛండాలమైన పనితో ఎంపీ అబ్రివేషన్ నే మారిపోయేలా చేశారనీ, అందరూ ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అంటున్నారని జస్బీర్ సింగ్ గిల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  వైసీపీ ఎంపీలు కూడా గోరంట్ల మాధవ్ వ్యవహారంలో మాట్లాడుతున్న మాటలు పార్లమెంటు పరువుతీసేలా ఉన్నాయన్నారు.

ఎంపీ భరత్.. గోరంట్ల మాదవ్ వీడియోను ఫోరెన్సిక్‌ను పంపామని ఒకసారి, అలాంటిదేమీ లేదని  మరోసారి చెబుతున్నారని, ఇలా ఆ పార్టీ ఎంపీలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తక్షణం విచారణ జరిపించి పార్లమెంట్ ఔన్నత్యం కాపాడాలని కోరారు.