జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మికి ఫోన్‌లో వేధింపులు

 

జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కొందరు గుర్తుతెలియని ఆగంతకులు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారు. ఈ మేరకు ఆమె బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. నాతో పాటు, నా తండ్రి  కే.కేశవరావు అంతు చూస్తా అంటూ బెదిరించడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిడుతున్నారని మేయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బోరబండ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎండీ సర్దార్‌ సంబంధించిన వ్యక్తులమని అగంతకులు చెబుతున్నారని మేయర్ ఆరోపించారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu