గంగుల ఎంట్రీ అయిపోయింది... ఏం జరగబోతుంది..?

 


మాజీ ఎంపీ గంగుల ప్ర‌తాప్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో.. విజయవాడలో ఆయన టీడీపీలో చేరారు. ఆయ‌న‌కు టీడీపీ కండువా క‌ప్పిన చంద్ర‌బాబు నాయుడు సాద‌రంగా త‌మ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా గంగుల ప్ర‌తాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను, చంద్ర‌బాబు ఒకేసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చామ‌ని, పార్టీలు వేరైనా తామిద్ద‌రం మంచి స్నేహితుల‌మ‌ని అన్నారు. చంద్ర‌బాబు నాయుడు చేస్తోన్న అభివృద్ధి ప‌నులు త‌న‌ను ఆకర్షించాయ‌ని, ఇటీవ‌లే తాను నంద్యాల స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు నాయుడితో చ‌ర్చించాన‌ని అన్నారు. చంద్ర‌బాబు నాయుడు సానుకూలంగా స్పందించార‌ని అన్నారు. ఆ సంద‌ర్భంగానే తాను టీడీపీ చేరాల‌నుకుంటున్నాన‌ని చంద్ర‌బాబుకి చెప్పాన‌ని అన్నారు.

 

మరి ఇక్కడి వరకూ బాగానే ఉంది. గంగుల ఎంట్రీతో భూమా ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే భూమా కుటుంబానికి.. గంగుల కుటుంబానికి మధ్య ఎన్నో ఏళ్లుగా విబేధాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రతాప్ రెడ్టి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారన్న వార్తలు వినగానే భూమా అఖిలప్రియ అలకపాన్పు ఎక్కినట్టు వార్తలు వినిపించాయి. మరి ఆయన టీడీపీలోకి రానే వచ్చారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం...