బంగారం తుప్పు పడుతుందంట.. గాలి కబుర్లు

బంగారం  తుప్పుపడుతుందని ఎప్పుడైనా విన్నారా?  .. ఔనండి నిజంగానే తన బంగారం తుప్పు పట్టిపోతుందని, సీజ్ చేసిన తన గోల్డ్ తనకు ఇచ్చాయాలని ఒక బడా మైనింగ్ మాఫియా కింగ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోతాయంటూ  మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్‌ చేసిన నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన కుమార్తె జి.బ్రాహ్మణి, కుమారుడు జి.కిరీటిరెడ్డి పిటిషన్లు దాఖలు చేయగా, తెలంగాణ హైకోర్టు వాటిని కొట్టేసింది.

బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని, విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థనను తిరస్కరించింది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్‌ ద్వారా రూ.884.13 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదుచేసి, నేరపూరిత సొమ్ముతో కొన్న నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోందని, అందువల్ల ఈ దశలో సీజ్‌ చేసిన వాటిని అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే నగలను, సొమ్మును తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu