బీజేపీ పార్లమెంటరీ బోర్డులో గడ్కరీకి దక్కని స్థానం

బీజేపీలో అత్యన్నత నిర్ణయాత్మకమైన పార్లమెంటరీ బోర్డు లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్థానం దక్కలేదు. అలాగే పార్టీలో మరో సీనియర్ నాయకుడైన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సైతం పార్లమెంటరీ బోర్డులో అవకాశం దక్కలేదు.

ఈ ఇరువురినీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడం పార్టీలో సంచలనం సృష్టించింది. ఒక విధంగా చెప్పాలంటే పార్టీ నిర్ణయం గడ్కరీకి షాకే. ఇటీవలే రాజకీయాల పట్ల వైరాగ్యం కలుగుతోందంటూ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు పార్టీలోనే కాక యావత్ రాజకీయ వర్గాలలోనూ సంచలనం సృష్టించిన సంగతి విదితమే.

అలాగే గడ్కరీకి కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా స్థానం కల్పించలేదు. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ కు కూడా స్థానం కల్పించలేదు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో  జేపీ నడ్డా, నరేంద్ర మోదీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, యడియూరప్ప, శర్బానంద్ సోనోవాల్, కే లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్ పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జాటియా, భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడ్నవిస్, ఓం మాథుర్, బీఎల్ సంతోష్, వనతి శ్రీనివాస్ ఉన్నారు.