జనగామలో భారీ పేలుడు... ఎగసిపడుతున్న మంటలు

జనగామ జిల్లా ఖిలాషాపురం తారా ఇండస్ర్టీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. రియాక్టర్ లు చార్జింగ్ పెడుతుండగా భారీ శబ్దంతో పేలాయి. ఈ ప్రమాదంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు అదుపు లోకి రాలేదు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లోని తారా ఇండస్ర్టీస్ లో కెమికల్స్ లో వాడే టిన్నర్ తయారవుతుంది. ఈ టిన్నర్స్ కు సంబంధించిన కెమికల్ ను నాలుగు రాష్ట్రాలకు తరలిస్తుంటారు. అయితే అక్కడ పనిచేసే కార్మికులు ఉదయమే తమ విధుల్లోకి వచ్చి రియాక్టర్స్ కు చార్జింగ్ పెడుతుండగా అక్కడ షాట్ సర్క్యూటైంది. ఒక్కసారిగా పొగలు అలముకున్నాయి. దీంతో అక్కడ పనిచేసే సిబ్బంది మొత్తం ప్రాణ భయంతో బయటకు పరుగులుతీశారు. అందరూ క్షేమంగా బయటికి వచ్చారు.

కాకపోతే ఆ ప్యాక్టరీ లో ఉన్న రియాక్టర్ల మొత్తం ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. మొత్తం భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించడంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. అందులో తయారు చేసేది పెయింటింగ్స్ లో వాడే టిన్నర్ అనే కెమికల్ కాబట్టి ఆ కెమికల్ ధాటికి మొత్తం ఆ వాతావరణమంతా దుర్ఘంద పూరితమైంది. ఖిలాషాపూర్ గ్రామానికి మొత్తం దట్టమైన పొగలు అలుముకోనున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెడుతున్నారు.