ప్రాణాలు పోయాక‌ అయ్యో అంటే ఎలా?

ప్ర‌జ‌ల‌కు డాక్ట‌ర్లే దేవుళ్లు. జ‌బ్బు చిన్న‌ద‌యినా, పెద్ద‌ద‌యినా దాన్నుంచీ బ‌య‌ట‌ప‌డేసేది ఈ  దేవుళ్లే. ఆస్ప త్రి పెద్ద‌దా, చిన్న‌దా, అన్ని వ‌స‌తులూ ఉన్నాయా లేదా అనేది సామాన్య ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా అవ‌గా హ‌న ఉం డ‌దు. ద‌గ్గ‌ర‌లో అప్ప‌టిక‌పుడు వెళ్ల‌డానికి  అందుబాటులో ఉన్న ఆస్ప‌త్రికే ప‌రిగెడ‌తారు. అదృ ష్టవ‌శాత్తూ స‌మ‌యానికి డాక్ట‌రు అందుబాటులో ఉండ‌డం, చికిత్స జ‌ర‌గ‌డం అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ప్రాణాలు నిలుస్తాయి. ఒక‌వేళ ఇవేవీ అనుకూలించ‌కుంటే? 

అస‌లా ప్ర‌శ్నే భ‌య‌పెడుతుంది. ముఖ్యంగా మ‌హిళ‌ల విష‌యంలో ఆస్ప‌త్రి వ‌ర్గాలు వీల‌యినంత జాగ్ర త్త‌లు పాటిస్తుంటారు. మారుమూల ప్రాంతాల్లో చిన్న‌పాటి క్లినిక్‌లు కూడా మ‌హిళ‌ల్ని కాపాడ‌డానికే కంక ణం కట్టుకుంటాయి. కానీ అన్ని వ‌స‌తులూ, అవ‌స‌ర‌మైన వ‌స్తుసాధనాలు వారికి అందుబాటులో ఉండాలి. ఉంటాయా అంటే న‌మ్మ‌కం ఆట్టే లేదు. కేవ‌లం ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కే అలాంటి సౌక‌ర్యాలు ఉంటాయి. కానీ ఫీజులు, అనేక ర‌కాల టెస్టుల‌పేరుతో భ‌య‌పెట్ట‌డం ఆయా ఆస్ప‌త్రివ‌ర్గాల‌కు ప‌రిపాటి. దీన్ని ఆయా వ‌ర్గాలు నిస్సందేహంగా వ్య‌తిరేకిస్తారు. కానీ జ‌రుగుతున్న వాస్త‌వం ఇదే.    

ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి లో కుటుంబ నియంత్రణ  శస్త్రచికిత్సల్లో దారుణం జరిగింది. మూడు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఒకే  ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న వీరు అస్వస్థతకు గురై మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున మరో మహిళ  లావణ్య మృతి చెందింది. దీంతో ఇప్పటి వరకు నలుగురు మహిళలు మృతి చెందారు. 

ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో 34 మంది మహిళలకు వైద్యులు కుటుంబ నియం త్రణ ఆపరేషన్లు చేశారు. ఇందులో కొంతమంది మహిళలు తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్‌తో అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతున్న వారిలో మొన్న ఇద్దరు, నిన్న ఒకరు, ఇవాళ మరొకరు మృతి చెందారు. వరుస మరణాలతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న మహిళలు తీవ్ర భయాందోళన చెం దుతున్నారు. కాగా మృతుల కుటుంబసభ్యులు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

అయితే ఇక్క‌డ ఒక్క ప్రశ్న త‌లెత్తుతుంది.. ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌డంతో ప‌ని అయిపో యిందనుకోవ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు?  అస‌లు ప్ర‌సూతి ఆస్ప‌త్రుల మౌలిక స‌దుపాయాల ప‌రిస్థితుల మీద ఒక  ప‌రిశీల‌నా కోణంలో చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కేవ‌లం ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌పుడే ప్ర‌భుత్వం ఆవేశ‌ప‌డి  ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం కాకుండా  ప్ర‌జాసంక్షేమాన్ని సీరియ‌స్‌గా తీసు కుని ఆస్పత్రుల గురించి వారి సేవ‌ల గురించి ఒక ప్ర‌త్యేక నిపుణుల సంఘం ఏర్పాటచేసి నిత్యం ప్ర‌త్యేకదృష్టి సారంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని విశ్లేష‌కుల మాట‌. మృతుల బంధువులు దాడి చేశార‌నో, అల్ల‌ర్లుకు దిగార‌నో ఆస్ప‌త్రి వ‌ర్గాలు ప్ర‌చారం చేసుకోవ‌డం కంటే అస‌లు  ఆ  ప‌రిస్థితి ఎం దుకు  త‌లెత్తింద‌నేది తెలుసుకోవాలి. మ‌హిళ‌లు, అందునా గ‌ర్భిణులు చ‌నిపోవ‌డం కంటే దారుణం మ‌రోటి ఉండ‌దు. మం దులు  చికిత్సా విక‌టించ‌డం చిన్న విష‌యం కాదు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu