TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హనీట్రాప్ వలలో మాజీ సైనికుడు: లిఫ్ట్ ఇచ్చిన పాపానికి బ్లాక్ మెయిల్.!

Published on: Sat Nov 14, 2026 10:54AM

 

 

హనీ ట్రాప్ ఉచ్చులో పడిన మాజీ జవాన్ ఉదంతమిది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన  సంచలనం సృష్టించింది. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సరిహద్దుల్లో సేవలు అందించిన ఓ మాజీ సైనికుడిని,   ఒక మహిళ  హనీట్రాప్ ఉచ్చులోకి లాగిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారిన పోతున్న ఆమెకు దయతో ద్విచక్రవాహనంపై లిఫ్ట్ ఇవ్వడమే ఆ మాజీ జవాను చేసిన నేరమైంది.   

వివరాలిలా ఉన్నాయి.  నవంబర్ 9న గిద్దలూరు పట్టణానికి చెందిన  మాజీ జవాన్ తన ద్విచక్రవాహనంపై పీఆర్ కాలనీ నుంచి మార్కెట్ ప్రాంతానికి బయలుదేరారు. అదే సమయంలో రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆయనను ఆపి లిఫ్ట్ కోరింది. ఆమె పరిస్థితిని చూసి జాలిపడిన ఆ మాజీ సైనికుడు తన బైక్ ఎక్కించుకున్నారు. అయితే ప్రయాణం సాగుతున్న కొద్దీ ఆ మహిళ   ఆయనతో మాటలు కలిపింది.  

అంతే కాకుండా ఆ మాజీ జవానుకు సన్నిహితంగా ఉన్నట్లు కొన్ని  దృశ్యాలను  సెల్‌ఫోన్‌లో రహస్యంగా రికార్డ్ చేసింది. గమ్యస్థానానికి చేరుకున్నాక ఆ మహిళ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.  బాధితుడిని బెదిరించడం మొదలుపెట్టింది. రహస్యంగా తీసిన ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ   బ్లాక్‌మెయిల్‌కు దిగింది.

 పరువు పోతుందనే భయంతో ఆ మాజీ సైనికుడిని లక్షన్నర డిమాండ్ చేసింది.   ఆమె వేధింపులు రోజురోజుకు మితిమీరిపోవడంతో మానసికంగా కుంగిపోయిన మాజీ జవాన్, తొలుత భయపడి తన ఫోన్‌పే ద్వారా  .7 వేల నగదును ఆమె ఖాతాకు బదిలీ చేశారు. అయినప్పటికీ సదరు మహిళ తన బెదిరింపులను ఆపకపోగా, మరింత మొత్తాన్ని డిమాండ్ చేయసాగింది.

ఇది కూడా చదవండి:  ఇదో స్పై లవ్ స్టోరీ: ఎన్విడియో సీఈవోకు, అమెరికా గూఢచారితో లవ్ ఎఫైర్.!

తాను హనీట్రాప్ ఉచ్చులో చిక్కుకున్నానని గ్రహించిన బాధితుడు,  ధైర్యం తెచ్చుకుని నేరుగా గిద్దలూరు అర్బన్ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి తనకు జరిగిన మోసాన్ని   వివరించారు. నిందితురాలు తనను ఏ విధంగా బెదిరించిందో వివరిస్తూ రాతపూర్వక ఫిర్యాదు చేశారు. 

బాధితుడి ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు,  ఐటీ చట్టాలు,  బ్లాక్‌మెయిలింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  ఫోన్‌పే లావాదేవీలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితురాలి ఆచూకీని కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.  

మీకు నచ్చవచ్చు: జూబ్లీహిల్స్‌లో హనీ ట్రాప్ కలకలం.!

అనంతలో హనీ ట్రాప్ కలకలం.. లక్షల రూపా యలుదోచుకున్న ముఠా.. పోలీసులపై ఆరోపణలు

 [ExServiceman,  Honeytrap,  WomanBlackmail, Giddalur, TeluguOne]