ఎన్నికల సంఘంపై విమర్శలు.. రాహుల్ తో గొంతు కలిపిన ప్రశాంత్ కిశోర్

ఒకప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్త అయి ఉండాలన్న అభిప్రాయం ఉండేది. 2014 కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరడానికైనా, 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నా.. అలాగే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వరుసగా మూడో సారి అధికార పగ్గాలను అందుకున్నారన్న.. అందుకు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సొంతంగా జన సురాజ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని బీహార్ లో తిరుగుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమై ఎదురీదుతున్నారు. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు రాహుల్ గాంధీకి వత్తాసుగా మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత ఎన్నికల కమిషన్ పై ఆటంబాంబు లాంటి ఆరోపణతో విరుచుకుపడుతున్న సమయంలోనే ఆయన అభిప్రాయాలకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేస్తున్నారు.  ప్రజలకు భారత ఎన్నికల సంఘంపై నమ్మకం పూర్తిగా పోయిందని ప్రశాంత్ కిశోర్ తాజాగా పేర్కొన్నారు.

ఎన్నికల కమిషన్ పారదర్శకత, పనితీరు, సమర్థత విషయంలో ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని అనడమే కాకుండా ఇది చాలా ఆందోళనకర విషయమన్నారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీ మాటలను ప్రస్తావించారు. వాటినే మరోమారు వల్లె వేశారు.  ఎన్నికల కమిషన్ అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ చేసిన విమర్శలనే ప్రశాంత్ కిశోర్ అఅలియాస్ పీకే  చేశారు.  బీహార్‌లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ను గాంధీ తీవ్రంగా విమర్శించారు, దీని ద్వారా దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు ఆరోపించిన రాహుల్ గాంధీ, అదుకు సంబంధించిన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. అంతే కాదు బీహాఆర్ లో  ఒకే నియోజకవర్గంలో దాదాపు లక్ష ఓట్లు గల్లంతయ్యాయనీ ఆయన తాజా ఓటరు జాబితాను ప్రదర్శించారు.  ముస్లిం , వలసదారులకు బీహార్ లో ఓటు హక్కు లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతోందని రాహుల్ ఆరోపణలు చేశారు.

అదే విషయాన్ని ప్రశాంత్ కిశోర్ కూడా చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారనీ, ఇది ప్రజాస్వామ్యం ఉనికికే పెనుముప్పు అని పీకే ఆందోళన వ్యక్తం చేశారు.  ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల  పట్ల ఒక విఆధంగా, అధికార పక్షం విషయంలో మరో విధంగా వ్యవహరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. ఇటువంటి చర్యలే ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లేలా చేస్తోందని ప్రశాంత్ కిశోర్ అన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu