ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం: 31 మంది సజీవదహనం.!
Published on: Thu Nov 26, 2026 10:12AM

ఈజిప్ట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో కనీసం 31 మంది మృత్యువాత పడ్డారు. మరో పాతిక మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశ రాజధాని కైరో నగర శివార్లలో రద్దీగా ఉండే రహదారిపై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఆ రహదారిపై చమురు ట్యాంకర్ బోల్తా పడి చెలరేగిన భారీ మంటల్లో చిక్కుకుని 31 మంది ప్రాణాలు కోల్పోయారు. వరాఖ్ ప్రాంతంలోని రింగ్ రోడ్డు సమీపంలో జరిగినఈ దుర్ఘటనలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.
అసలీ ప్రమాదం ఎలా జరిగిందంటే.. ప్రైవేటు కాంట్రాక్టర్కు చెందిన ఓ పెట్రోల్ ట్యాంకర్ రహదారిపై వెళ్తున్న సమయంలో ఆకస్మికంగా హైటెన్షన్ విద్యుత్ వైరు తెగి దాని ఎదుట పడింది. ఈ ఘటనతో ట్యాంకర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది.

వెంటనే ట్యాంకర్లోని పెట్రోల్ బయటకు లీకై సమీపంలోని ఇతర వాహనాల వద్దకు చేరుకుంది. అదే సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో పక్కనే ఉన్న వాహనాలలు కూడా మంటలలో చిక్కుకున్నాయి. వాటిలో ప్రయాణిస్తున్న వారికి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది.
ఇది కూడా చదవండి:
అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే అప్పటికే 31 మంది మృతి చెందారు. మరో పాతిక మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

రహదారుల నిర్వహణ, విద్యుత్ లైన్ల భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రాణనష్టం జరిగే దుర్ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన రక్షణ చర్యలు అమలు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
మీకు నచ్చవచ్చు: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబంలో నలుగురు మృతి.!
ఒంగోలు సమీపంలో రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం.!
[Egyptaccident, Cairo highway, petrol tanker, 31 dead, 21injured, TeluguOne]


