TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒంగోలు సమీపంలో రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం.!

Published on: Sat Nov 21, 2026 9:21AM

ప్రకాశం జిల్లాలో  జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.  మరో ఇద్దరు గాయపడ్డారు.   తిరుపతి నుంచి బాపట్లకు ఆరుగురు వ్యక్తులు  కారులో  వెడుతుండగా శనివారం (నవంబర్ 21)  ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద  డ్రైవర్ నియంత్రణ కోల్పోయి కల్వర్టును ఢీకొని కాలువలో పడిపోయింది.   

ఈ ఘటనలో కారు   డ్రైవర్ ప్రవీణ్‌తో పాటు వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న నూతన దంపతులు శ్రీతేజ, కైవల్య స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే  ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.  


[Road accident,  Prakasam district,  Pelluru, Fourdead,  Tirupati , Bapatla, TeluguOne]