ఫిలిప్పీన్స్ ను కుదిపేసిన భూకంపం
posted on Oct 1, 2025 9:13AM

ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్ లోని సెబు ప్రావిన్స్‌లో మంగళవారం (సెప్టెంబర్ 30) బోగో నగరానికి ఈశాన్యంగా 19 కిలోమీటర్ల దూరంలో, భూమికి 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
భూ ఉపరితలానికి అతి సమీపంలో భూకంప కేంద్రం ఉండటంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ భూకంప ప్రభావంతో పలు చోట్ల వంతెనలు దెబ్బతిన్నాయి. విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. భారీగా ప్రాణనష్టం జరిగినట్లు చెబుతున్నారు. అధికారికంగా ఈ భూకంపం కారణంగా పాతిక మంది మరణించినట్లు ప్రకటించారు. పలు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. పెద్ద సంఖ్యలో జనం క్షతగాత్రులయ్యారు. మతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.