ఇస్లాం మతంపై మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికా అంటే గిట్టదు..

అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇస్లాం మతం.. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా మరోమారు నోరు జారారు. సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన.. ఇస్లాం మతానికి అమెరికా అంటే గిట్టదని నాకు అనిపిస్తోంది.. అమెరికన్లను వ్యతిరేకించే వారిని దేశంలోకి అనుమతించరాదని..  తీవ్రవాద భావజాలాన్ని నింపే ఇస్లాంపైనే అమెరికా యుద్ధం చేస్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఏమనుకున్నాడో ఏమో.. రాడికల్ భావాలున్న ఇస్లాం గురించి తాను చెపుతున్నానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో తన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న ట్రంప్.. ఇప్పుడు ఈవ్యాఖ్యలతో ఎలాంటి ఇబ్బందుల్లో పడతారో.