తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు పూర్తియినా కూడా తిరుమలేశుని దర్శనానికి జనం  రద్దీ ఇసుమంతైనా తగ్గలేదు. వారాంతం సమీపిస్తుండటంతో ఈ రద్దీ రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉంది. గురువారం (జూన్ 19) ఉదయం శ్రీవారి దర్వనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శ్రీకృష్ణ తేజ గెస్ట్ హౌస్  వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (జూన్ 18) శ్రీవారిని మొత్తం 80 వేల 44 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల687 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 47 లక్షల రూపాయలు వచ్చింది.