ఏపీకి బిగ్ రిలీఫ్: బలహీనపడిన ఆక్వాన్.. సాధారణ వాయుగుండంగా తీరం దాటే చాన్స్.!
Published on: Wed Nov 18, 2026 2:30PM

గత మూడు రోజులుగా ఏపీ ప్రభుత్వానికి, తీర ప్రాంత ప్రజలకూ కంటి మీద కునుకు లేకుండా చేసిన అక్వాన్ తుపాన్ తీరం దాటడానికి రెండు రోజుల ముందే బాగా బలహీనపడింది. అక్వాన్ తుపాను తీవ్ర వాయుగుండంగా, అక్కడ నుంచి సాధారణ వాయుగుండంగా మారి తీరం దాటనుంది. ఏపీ భూ ఉపరితలంపై నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా అక్వాన్ తుపాను తీవ్రత కోల్పోయింది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికి ఇది మరింత బలహీనపడి శుక్రవారం (నవంబర్ 20) నాటికి సాధారణ వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ తాజా అంచనా ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.
ఉపగ్రహ విశ్లేషణల ప్రకారం, ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్నానికి 606 కిలోమీటర్లు, కాకినాడకు 624 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 673 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమూ ఉంది తుపాను స్థాయి నుంచి బలహీనపడిన ఈ వ్యవస్థలో ప్రస్తుతం గరిష్టంగా గంటకు 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఈ మార్పు వల్ల తుపాను బలం పూర్తిగా క్షీణించింది. దీని ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు, ఉరుములతో కూడిన మెరుపులు కేవలం సముద్రం పైనే కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే ఈ వాయుగుండానికి సంబంధించిన బాహ్య మేఘాల చారలు ఉత్తరాంధ్ర మరియు ఒడిశా తీర ప్రాంతాలను తాకాయి. దీనివల్ల తీరప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది.

ఇప్పటి వరకూ అక్వాన్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారి పెను విధ్వంసం సృష్టిస్తుందని హెచ్చరికలు జారీ కావడంతో తీరప్రాంత జిల్లాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కానీ ప్రకృతి అనుకూలించి భూభాగం నుంచి వీచిన పొడి గాలులు తుపాను శక్తిని నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఇది కూడా చదవండి: తుపాను నష్టాన్ని కనిష్టం చేయడానికి సర్వశక్తులూ ఒడ్డాం: ఏపీ సీఎం చంద్రబాబు.!
తుపాను బలహీనపడటంతో కోతల దశలో ఉన్న పంటలకు ప్రమాదం తప్పిందని అన్నదాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. భారీ గాలులు, అతి భారీ వర్షాల ముప్పు తగ్గిపోవడంతో వ్యవసాయ పనులకు పెద్దగా ఆటంకం కలగకపోవచ్చని భావిస్తున్నారు.ఈ తీవ్ర వాయుగుండం కదలికలు మరియు తీరం దాటే ప్రాంతంపై వాతావరణ నిపుణులు నిరంతరం నిఘా ఉంచారు.

వ్యవస్థ గమనంపై మరింత స్పష్టత వచ్చిన వెంటనే, ఏయే ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయనే పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: ఏపీకి మరో తుపాను ముప్పు: రాష్ట్రంపై ప్రకృతి పగపట్టిందా.?
ఏపీకి మరో తుపాను ముప్పు.. ముందస్తు చర్యలకు సీఎం చంద్రబాబు సమీక్ష.!
[CycloneAkvanWeakens, Deep Depression, Bay of Bengal, AP Weather,Dangeraverted, AP, Bigrelief, TeluguOne]


