TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తుపాను నష్టాన్ని కనిష్టం చేయడానికి సర్వశక్తులూ ఒడ్డాం: ఏపీ సీఎం చంద్రబాబు.!

Published on: Wed Oct 28, 2026 5:58PM

ఆంధ్రప్రదేశ్  అర్నాబ్ ముప్పు తొలగిపోయింది.  తుపాను తీరం దాటిన తరువాత బలహీనపడి పక్క రాష్ట్రాలవైపు తరలిపోయింది. ఈ విషయాన్ని బుధవారం (అక్టోబర్ 28) మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన   ఆర్టీజీఎస్ ద్వారా వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ప్రజలను ముందుగానే అప్రమత్తం చేశామన్నారు. ఎక్కడ ముంపు ఉంటుందో ముందే హెచ్చరించామని చెప్పారు. మూడు రోజుల్లో తుఫాన్‌పై 8సార్లు సమీక్ష నిర్వహించామని చంద్రబాబు చెప్పారు. ప్రాణ నష్టం నివారణే లక్ష్యంగా పని చేశామన్నారు. సేఫ్, సెక్యూరిటీ, రిహాబిటేషన్ ప్రకారం ముందుకెళ్లామన్నారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో ఐదుగురు మృత్యువాత పడటం బాధాకరమని చెప్పిన ఆయన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు.  

[CM Chandrababu Pressmeet, , Cyclone Arnab AP, Zero Casualty Goal, Andhra Pradesh Storm, TeluguOne News]