అత్యంత తీవ్ర తుపానుగా ఆక్వాన్: ఆంధ్రా తీరానికి పెనుముప్పు.!
Published on: Wed Nov 18, 2026 9:58AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ పెను తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది. ఈ తుపాను ప్రస్తుతం ఈ తుపాను చాలా నెమ్మదిగా పయనిస్తూ, అంతకంతకూ బలపడుతోంది. దీని ప్రభావం ఆంధ్రా తీరంపై తీవ్రాతి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను ఉటంకిస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ పేర్కొన్నారు.
గత ఆరు గంటల వ్యవధిలో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుపాను, చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం, విశాఖపట్నాలకు 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తున్న ఈ తుపాను గురువారం (నవంబర్ 19) సాయంత్రానికి మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్వాన్ శుక్రవారం (నవంబర్ 20) తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

తుపాను తీరం దాటే సమయంలో తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, అత్యంత భారీ వర్షాలు ఉంటాయని పేర్కొంది. ఈదురుగాలుల వేగం గంటకు 150 కిలోమీటర్లకు మించి ఉంటుందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: అర్నాబ్ ఎఫెక్ట్: కోనసీమ అంధకారం.. లోతట్టు ప్రాంతాలు జలమయం, తగ్గని గాలుల తీవ్రత.!
ఈ తుపాను ప్రభావం వల్ల గురు, శుక్ర వారాల్లో (నవంబర్ 19, 20) రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో అలల ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందనీ, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని రాష్ట్ర విపత్తుల శాఖ సూచించింది.

తుపాను తీరం దాటే సమయంలో ఎలాంటి ప్రాణ, నష్టం జరగకుండా ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేశారు.
మీకు నచ్చవచ్చు: నవంబర్ 19.. చరిత్రలో చేదు జ్ఞాపకం.. దివిసీమ ఉప్పెన మానని గాయం..
ఆంధ్రప్రదేశ్.. 55 ఏళ్లలో 61 తీవ్ర తుపానులు!
[Cyclone Aquan, APweather, Heavyrains, Warning, TeluguOne]


