రాష్ట్రానికి మరో తుఫాను గండం

 

పైలిన్‌, హెలెన్‌ తుఫానులు సృష్టించిన బీభత్సాలను మర్చిపోకముందే ఇప్పుడు మరో గండం రాష్ట్రం మీదకు ముంచుకు వస్తుంది. ఇప్పటికే పైలిన్‌, హెలెన్‌ల తుఫానులతో తీవ్రనష్టాలను ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడు మరో తుఫాను వస్తుందన్న భయంతో బిక్కుబిక్కు మంటున్నారు. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర వాయుగుండంగా మారింది.

ప్రస్తుతం పోర్ట్బ్లెయిర్కు దక్షిణ ఆగ్నేయంగా 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తీవ్ర వాయుగుండం, ఈ రాత్రికే తుఫానుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఇది ఈనెల 26వ తేదీలోగా వాయవ్య దిశగా మన రాష్ట్రంవైపు పయనించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని అన్ని
ప్రధాన ఓడరేవుల్లో మరోసారి ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.