సామూహిక సంకల్ప శక్తి  సమీకరణ! యత్భావం తత్ భవతి!

ఒక్క గడ్డిపోచ ఏనుగును బంధించలేవు... అదే ఒక వెయ్యి గడ్డిపోచలు కలిస్తే మహా బలమైన ఏనుగును సైతం భందిస్తాయి.... భావన ఎంత బలంగా ఉంటుందో భవతి అంత బలంగా ఉంటుంది. అంటే మనం ఎం జరగాలని ఎంతబలంగా సంకల్పిస్తామో భవతి అంటే జరగబడేది కూడా అంతే బలంగా ఉంటుంది..

కేవలం ప్రదాని ఒక్కరే కరోన వైరస్ నశించాలని  సంకల్పిస్తే సరిపోతుందా....? కాదు మనమందరం అదే సంకల్పాన్ని బలంగా సంకల్పిస్తే కరోన ఏంటి ఏదైనా జరగడానికి సాధ్యమే.....

మరి దీపాలు ఎందుకు ముట్టించాలి.....ఆయన ఏమన్నారు మన ఆత్మశక్తి దేనికంటేనూ భలహీనమైంది కాదు...అన్నారు అలాగే మన ఆత్మ శక్తి ని గుర్తుచేసుకోవడానికే ఆ దీపపు కాంతి...నిదర్శనం...నేను శరీరము కాదు...ఆత్మజ్యోతిని.....అన్న బలమైన నమ్మకంలోంచి ఆ 9 నిమిషాలూ మనం మనసా...వాచా కర్మణా.. మన బలమైన సంకల్పాన్ని... ఆత్మకాంతిని,,,,ఈ విశ్వంలోనికి విడుదల చేసినట్లయితే.... ఆ బలమైన  సామూహిక ఆత్మశక్తి ఈ విశ్వంలోకి విడుదల అవుతుంది....మనం ఏ సంకల్పం తో అయితే విడుదల చేశామో...ఆ సంకల్ప దిశవైపే ఆ విడుదల అయిన శక్తి ప్రయాణిస్తుంది...

ఏ రకమైన సంకల్పాలో ....ఆ రకమైన వాస్తవాలు...

ఇదే యోగ సిద్ధాంతం యొక్క ప్రాథమిక నియమము... మనం  మన సంకల్ప శక్తిని వైరస్ ఈ భూమిని వదిలి వెళ్లాలని విడుదల చేయబోతున్నాం...ఆ విడుదలైన శక్తి అదే వాస్తవాన్ని మోసుకొస్తుంది...

ఇది పక్కా....ఆధ్యాత్మిక శాస్త్రం... అందరూ ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు మీరు మీ ఆత్మ స్పృహలో ఒక దీపాన్ని వెలిగించి.... ఆ దీపపు వెలుగులో మీ అంతర్ముఖంలో మీరు ఆత్మగా... మీ ఆత్మశక్తిని మీ పరిపూర్ణమైన ఏక సంకల్పంలో 9 నిమిషాల పాటు ప్రశాంత స్థితిలో....మీ శక్తిని విడుదల చెయ్యాలి....అంతే.