డైమండ్ రాణి సందడి ‘గ్యాంగ్స్ ఆఫ్ గగన్-3’

తెలుగువన్ అందించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గగన్’ పొలిటికల్ స్పూఫ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో వుంది. ఇప్పటి వరకు విడుదలైన రెండు ఎపిసోడ్స్ ప్రేక్షకులను నవ్వుల వరదలో ముంచెత్తడంతోపాటు ఆలోచింపజేస్తున్నాయి. గగన్ అనే దుర్మార్గపు పాలకుడి ప్రజా వ్యతిరేక విధానాలను హాస్యభరితంగా చూపించే ప్రయత్నం చేసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గగన్’ ప్రేక్షకాదరణ పొందుతోంది. 

కాగా, ఈ సిరీస్లో మూడో ఎపిసోడ్ శనివారం నాడు రిలీజ్ అయింది. మొదటి, రెండవ ఎపిసోడ్స్.లో మెరుపులా మెరిసిన డైమండ్ రాణి, ఈ ఎపిసోడ్‌లో పూర్తి స్థాయిలో తన ‘టాలెంట్’ ప్రదర్శించింది. ఈ ఎపిసోడ్ కూడా ‘గ్యాంగ్స్ ఆఫ్ గగన్’ రేంజ్‌ని పెంచేలా వుంది.