గొడుగుతో క‌రోనాను క‌ట్ట‌డిచేయ‌వ‌చ్చ‌ట‌!

కరోనా బారిన పడకుండా ఉండేందుకు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు మరో చిట్కా చెబుతున్నారు. సోషల్ డిస్టెంన్స్ పాటించమంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతోంది. అయితే ఆ సూచన మేరకు దాన్ని అమలు పరచాలంటే ప్రతి ఒక్కరు గొడుగు ఉప‌యోగిస్తే ఒకరికొకరు కనీసం మీటరు దూరం పాటించినట్లవుతుందని ఆయన సలహా ఇస్తున్నారు. 

ఎదుటి వ్యక్తి నుంచి దగ్గు, తుమ్ము వంటి వాటి నుంచి వచ్చే తుంపర్ల బారిన పడకుండా గొడుగు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. వ‌ర్షం, ఎండ నుంచే కాదు వైర‌స్ బారిన ప‌డ‌కుండా గొడుగు ర‌క్షిస్తుంద‌ట‌. అయితే గొడుగు వేసుకుని బయటకు వెళ్లి వచ్చిన వెంటనే దాన్ని ఎండలోనే కొద్ది సేపు ఉంచి లోపల పెడితే మంచిదని డాక్టర్ సూచిస్తున్నారు.

చేతులు కడుకున్నాం, మాస్క్ పెట్టుకున్నాం, ఇదేదో గొడుకు కూడా వాడుదాం. టైం అలా వుంది. ఏం చేస్తాం మ‌రి! డెడ్లీ వైర‌స్‌....