క‌రోనా కాటుకు 21వేల 200 మంది బ‌లి!

మార్చి 26వ తేదీ గురువారం ఉదయం వరకు ప్రపంచ వ్యాప్తంగా 21, 200 మందిని క‌రోనా మహమ్మారి బలి తీసుకుంది. మొత్తం 4 లక్షల 68 వేల 905 మందికి ఈ వైరస్ సోకింది. అందులో 14 వేల 792 మందికి సీరియస్ గా ఉంది. 3 లక్షల 33 వేల 487 మంది ఈ వైరస్ తో పోరాడుతుంటే...లక్షా 14 వేల 218 మంది కోలుకున్నారు.

198 దేశాకు కరోనా వైరస్ విస్తరించింది. ఇటలీ : 7,503. స్పెయిన్ : 3,647. చైనా : 3,287, ఇరాన్ : 2, 077. ఫ్రాన్స్ : 1,331, యూఎస్ఐ : 994. యూకే : 465. నెదర్లాండ్స్ : 356. జర్మనీ : 206, బెల్జియం : 178. స్విట్జర్లాండ్ : 153. సౌత్ కొరియా : 126 మంది చ‌నిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు నాలుగున్నర లక్షలు దాటేసింది.

మన దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. లాక్‌ డౌన్‌ పాటిస్తున్నా.. వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య వృద్ధి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకూ దేశంలో 649 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 12 మంది చనిపోయారు.

మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో పాజిటివ్‌ వచ్చిన రోగులు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణా రోగుల సంఖ్య 41కి చేరుకుంది. ఏపీలో కొత్తగా రెండు పాజిటివ్‌ కేసులు వెలుగు చూడటంతో వైరస్‌ వచ్చిన వారు పది మంది అయ్యారు. లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తున్నా.. నిన్న హైదరాబాద్‌తోపాటు.. ఏపీ, తెలంగాణ బోర్డర్‌లో భారీగా జనం గుమిగూడటం ఆందోళన కలిగించింది.