మోడిని అమెరికా రానివ్వకండి

దేశ వ్యాప్తంగా మోడీ హవా బలపడుతున్న నేపథ్యంలో  ప్రత్యర్థి పార్టీలు ఆయనను ఎదుర్కోవటానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు.. ఇప్పటికే మోడిపై గుజరాత్ అల్లర్లు లాంటి విషయాలతో విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న పార్టీలు ఇప్పుడు మరో ఎత్తు వేశాయి.

గుజరాత్ అల్లర్ల తరువాత హిందుత్వ వాదిగా ముద్రపడ్డ మోడిపై అమెరికా నిషేదం విదించింది.. ఆయన అమెరికా అనుమతించకుండా విసా నిరాకరించింది.. అయితే ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రన్ని అభివ్రుద్ది పథంలో నడిపిస్తుండటంతో అమెరికా ఆయనపై కొనసాగుతున్ననిషేదం పై పునరాలోచనలో పడింది.

దీంతో ఇప్పుడు మోడీని అమెరికాకు అనుమతించొద్దు అంటూ పత్యర్ధి పార్టీల ఎంపిలు అమెరికా అధ్యక్ష్యుడు బరాక్ ఒబామాకు లేఖ రాశారు.. 25 మంది రాజ్యసభ, 40 మంది లొక్ సభ ఎంపిల సంతకాలతో ఈ లేఖను ఒబామాకు పంపించారు..మొదట రాజ్యసభ స్వతంత్ర అభ్యర్ది మొహమద్ అదిబ్ లేఖ రాయగా దానికి పలువురు కాంగ్రెస్, సిపిఐ, సిపియం సభ్యలు మధ్దతు పలికారు..