సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట

 

సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2021లో ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టాయి. ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులు ముఖ్యమంత్రితో పాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ దశలో ఉంది. 

ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, తనపై నమోదైన ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, కింది కోర్టులో విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. ఈ వ్యవహారంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావును హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల, అనగా అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu