కేజ్రీవాల్ కు సరదా అయిపోయింది..వెంకయ్యనాయుడు


ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈరోజు సీబీఐ దాడులు జరిపిన సంగతి తెలిసిందే.సీఎంవో ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజేందర్ సింగ్ కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాడులు చేశామని..సీబీఐ స్పష్టం చేసింది.దీనికిగాను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.మోడీ కావాలనే సీబీఐతో దాడులు చేయించారని..ఇలాంటి చర్యలకు తాను భయపడేది లేదని..ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యలకు స్పందించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఘాటుగా సమాధానమిచ్చారు.ప్రతి చిన్న విషయానికి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు తగదని..కేజ్రీవాల్ ప్రతి విషయానికి కేంద్రంతో గొడవపడటం సరదాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతేకాదు సీబీఐ ఒక స్వచ్ఛంధ సంస్ధ అని దానిపై రాజకీయ పార్టీల అజమాయిషీ చెల్లదని తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

మరోవైపు ఈ దాడులకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ కూడా స్పష్టం చేసింది.కంపెనీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకే దాడులు చేశామని సీబీఐ తెలిపింది.