8 జిల్లాలతో విశాఖ ఎకనమిక్ రీజియన్..లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు : చంద్రబాబు

 

వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.  ఇవాళ అమరావతిలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయాలు ప్రకటించారు. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏఎస్ఆర్, మన్యం జిల్లాల్ని రీజియన్‌ను అభివద్ది చేయాలన్నారు. వివిధ ప్రాజేక్టుల కోసం లక్ష ఎకరాలను గుర్తించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మూలపేట-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. 

వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు. సముద్ర తీరం సంపద నిలయమని, దానిని మరింత వినియోగించుకునేలా చూడాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 20 లక్షల మందికి అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తున్నట్లు సీఎం తెలిపారు.2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి లక్ష్యంతో విశాఖ ఎకనమిక్ రీజియన్'ను రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు ఉత్తరాంధ్రను కూడా అదే స్ధాయిలో అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu