విశాఖ వేదికగా సీఐఐ సదస్సు ప్రారంభం: ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి పియూష్ గోయెల్.!
Published on: Thu Nov 12, 2026 9:53AM

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సు గురువారం (నవంబర్ 12) ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ప్రవహించనున్నాయన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగ దిగ్గజమైన కియా మోటార్స్ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తుండటం, రాష్ట్రంలో నూతన ఉపాధి అవకాశాలకు పెద్దపీటవేస్తోంది.
అనంతపురం జిల్లా పెనుకొండ కేంద్రంగా ఇప్పటికే తన తయారీ యూనిట్‌తో విజయవంతంగా రాణిస్తున్న కియా మోటార్స్, దాని అనుబంధ పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో సుమారు రూ. 22,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. దీని ద్వారా పదివేల మందికి పైగా స్థానిక యువతకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తోంది.
విశాఖ సీఐఐ సదస్సు వేదికగా ఈ పారిశ్రామిక విజయాలను ప్రదర్శిస్తూ, భవిష్యత్తులో ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ ( రంగాలలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఏపీ వైపు చూసేలా చేస్తోంది.

రాష్ట్రంలో నెలకొన్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, పారదర్శక విధానాలు, పటిష్ట మౌలిక వసతుల కల్పన కారణంగా పెట్టుబడిదారుల నమ్మకం ఇనుమడించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ వల్ల అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి. ఈ సదస్సులో కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా, ఇప్పటికే ప్రతిపాదిత దశలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా గ్రౌండింగ్ చేసేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఇది కూడా చదవండి: భాగస్వామ్య సదస్సుకు అమిత్ షా డుమ్మా: హాజరు కానున్న పీయూష్ గోయెల్.!
భారతదేశానికి ప్రధాన పారిశ్రామిక హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరులు, ఆటోమొబైల్స్, ఐటీ, లాజిస్టిక్స్ మరియు ఏరోస్పేస్ రంగాలలో వస్తున్న పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక రూపురేఖలను మార్చే విధంగా ఉన్నాయి. గ్లోబల్ సప్లై చైన్‌లో ఆంధ్రప్రదేశ్‌ను కీలక భాగస్వామిగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కియా మోటార్స్ వంటి అగ్రగామి సంస్థల విస్తరణ రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈ రంగానికి, అనుబంధ పరిశ్రమలకు ఎంతగానో ప్రయోజనకరంగా మారుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రాబోయే సంవత్సరాల్లో రాష్ట్రంలో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. విశాఖ సీఐఐ సదస్సు విజయవంతం కావడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ మరింత బలపడింది. పారిశ్రామిక రంగానికి పెద్దపీఠ వేస్తున్న ఈ పరిణామాలు రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ పెట్టుబడి గమ్యస్థానంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.
మీకు నచ్చవచ్చు: విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు: పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యం.!
ఈ నెల 12, 13వ తేదీల్లో సాగర తీరాన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026.!
[CIIpartnershisummit, Visakhapatnam, Chandrababu Naidu, Piyushgoel, TeluguOne]


