TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భాగస్వామ్య సదస్సుకు అమిత్ షా డుమ్మా: హాజరు కానున్న పీయూష్ గోయెల్.!

Published on: Wed Nov 11, 2026 3:32PM

విశాఖ  వేదికగా గురువారం (నవంబర్ 12) నుంచి ప్రారంభం కానున్న  సీఐఐ భాగస్వామ్య సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కావడం లేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ సదస్సుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన రద్దైంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ అఫీషియల్ గా ప్రకటించింది. 

విశాఖ వేదికగా జరగాల్సిన భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సి కేంద్ర మంత్రి అమిత్ షా  అనివార్య కారణాలతో తన పర్యటనను రద్దు చేసుకోవడంతో..ఆయన బదులుగా ఈ సదస్సు ప్రారంభోత్సవానికి కేంద్ర  వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గురు, శుక్రవారాలలో (నవంబర్ 12, 13 )  రెండు రోజుల పాటు ఈ భాగస్వామ్య సదస్సు   జరగనుంది. సీఐఐ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డీపీఐఐటీ, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ భారీ ఈవెంట్‌కు శ్రీకారం చుట్టాయి.

'నావిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్:  ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్ అనే  ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 58 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, వివిధ రంగాల అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఈ సదస్సుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ఇది చదవండి:  విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు: పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యం.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సదస్సుకు కో-ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ కార్యక్రమ నిర్వహణను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా, నవంబర్ 13న జరగనున్న ముగింపు సమావేశానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

కాగా ఈ సదస్సులో చర్చించాల్సిన ముఖ్యమైన అంశాలు, ప్రకటించబోయే డిక్లరేషన్లు,  విదేశీ ప్రతినిధుల రాకపై సీఎం ఇప్పటికే అధికారులకు  స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విశాఖ వేదికగా జరిగే  ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో అపారంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలకు బలంగా చాటిచెప్పాలన్నారు. విధాన రూపకర్తలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు,  స్టార్టప్స్  మధ్య బలమైన వారధిగా ఈ సదస్సు నిలవాలని చంద్రబాబు పేర్కొన్నారు.

మీకు నచ్చవచ్చు:  ఈ నెల 12, 13వ తేదీల్లో సాగర తీరాన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026.!

అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ఏపీ నంబర్ 2: యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడి.!

[Amit Shah Visakhapatnam Tour Canciled, CII Partnership Summit, Piyush Goyal Attend, Visakhapatnam CII Meeting, Telugu One]