దేవినేని ఉమాకు సీఐడీ నోటీసులు.. టార్గెట్ టీడీపీ?

మాజీ మంత్రి దేవినేని ఉమాకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదుతో కేసు నమోదైంది. గురువారం ఉదయం కర్నూలు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని గొల్లపూడిలోని ఉమా నివాసంలో నోటీసులు అందజేశారు.  

ఈనెల 7న దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. అందులో మార్ఫింగ్‌ చేసిన జగన్‌ వీడియోలు ప్రదర్శించారనేది అభియోగం. ఈమేరకు 464, 465, 468, 469, 470, 471, 505, 120(బి) సెక్షన్ల కింద ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని నోటీసులో సూచించారు. దేవినేని ఉమాకు సీఐడీ నోటీసులు ఇవ్వడం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలేనంటూ ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.