ఆపరేషన్ చేయించుకున్న చిరంజీవి..

సినీ నటుడు చిరంజీవికి ముంబై లోని బ్రీచ్ క్యాండీ హాస్పటల్ భుజానికి శాస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. గత గొద్ది రోజులుగా చిరంజీవి భుజం నొప్పితో బాధపడుతున్నారు. అయితే తన 150 వ సినిమా కత్తి రీమేక్ చేస్తున్న నేపథ్యంలో.. ఆ సినిమాకి ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఆలోచనతోనే ఈ ఆపరేషన్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ అనంతరం చిరంజీవి ఈజు ముంబై నుండి హైదరాబాద్ కు రానున్నారు. కాగా ఫిబ్రవరి నెలాఖరులోగానీ.. మార్చి లో గానీ కత్తి రీమేక్ ను పట్టాలెక్కించాని చిరు భావిస్తున్నారట.