ఛత్తీస్‌గడ్‌లో 22 మంది మావోలు లొంగుబాటు
posted on Jul 11, 2025 4:35PM

ఆపరేషన్ కగార్ దెబ్బకు మవోయిస్టులు దిగివచ్చారు. ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ ఎదుట 22 మంది మవోలు లోంగిపోయారు. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన మావోలపై రూ.37 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వీరు కుతుల, నెలనార్, ఇంద్రావతి ఏరియా కమిటీలలో క్రియాశీలకంగా ఉన్నారు.
లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు రూ.25,000 ఆర్థిక సహాయం, ఇళ్ళు, ఉపాధి వంటి పునరావాస సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. 2024 నుంచి బస్తర్‌లో 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. కాగా కొంత కాలంగా కేంద్రం మవోయిజంపై ఉక్కుపాదం మోపుతుంది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరిపారేస్తున్న సంగతి తెలిసిందే.