బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ కీలక మావోయిస్టు మృతి

 

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌లో చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో  మరో కీలక నేత మైలార‌పు ఆడెల్లు అలియాస్ భాస్కర్‌ మృతి చెందారు. అతని తలపై రూ.25 లక్షల రివార్డు ఉందని తెలిపాయి. ఘటనాస్థలి నుంచి ఏకే-47, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, కోబ్రా బలగాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్‌ కొనసాగుతోంది.  బీజాపూర్‌ జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మీనర్సింహాచలం అలియాస్‌ గౌతమ్‌ అలియాస్‌ సుధాకర్‌ అలియాస్‌ బండి ప్రకాశ్‌ మరణించిన విషయం తెలిసిందే. 

బీజాపూర్‌ జిల్లాలోని నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా రిజర్వ్‌ గార్డ్స్‌(డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) భద్రతా దళాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఆడెల్లు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామం. భాస్కర్ కేంద్ర కమిటీతోపాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా పని చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర కమిటీ స్థాయికి భాస్కర్ ఎదిగారు.ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో ఏకే 47తోపాటు పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu