జగన్ చంద్రబాబుని ఫాలో అవ్వట్లేదా?

ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు ఏడాది ఉన్నా.. అధినేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న తీరుతో రాజకీయ వాతావరణం వాడి వేడీగా మారింది.రాజకీయ విమర్శలు పక్కనపెట్టి, వ్యక్తిగతంగా దూషించడం ఎక్కువ కావడం రాజకీయాలను మరింత దిగజారుస్తోంది.జగన్ ..పవన్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వివాదంలో తలదూర్చవద్దని తెలుగు తమ్ముళ్ళకి చంద్రబాబు సూచనను చేసినట్లుగా తెలుస్తోంది.

 

 

ఇదిలా ఉంటే చంద్రబాబు ఈ వ్యక్తిగత విమర్శలకు దూరం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మహానాడులో భాగంగా ఓ కార్యకర్త ఆవేశంతో పవన్ కళ్యాణ్ ను విమర్శించే క్రమంలో భాగంగా పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకురాగా, అక్కడే ఉన్న చంద్రబాబు మరుక్షణం సదరు యువకుడికి సూచనలతో కూడిన వార్నింగ్ ఇచ్చారు. తమ్ముళ్ళు… ఎంత ఎమోషన్ ఉన్నా, వ్యక్తిగతంగా ముందుకుపోవద్దు, ఒక రాజకీయ పార్టీగా హుందాగా వ్యవహరించాలి, చేసే పనులు చెప్పాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయొద్దు అంటూ చంద్రబాబు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.