చంద్రబాబుతో టీ.టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ

 

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న తెలుగు దేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభమైంది.ఈ భేటీలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు చర్చించనున్నారు.తమ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులను చంద్రబాబు ఎంపిక చేస్తారని పార్టీ నాయకులు భావిస్తున్నారు.అన్నిటికంటే ముఖ్యంగా మహాకూటమిలో తెలుగు దేశానికి వచ్చే సీట్లు సహా, కూటమిలో సీట్ల సర్దుబాటుపైన కూడా చర్చించే అవకాశం ఉంది.2014 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కీలక స్థానాలను టీటీడీ దక్కించుకుంది. వాటితో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు, కరీంనగర్‌లో ఒకటి, పాలమూరు జిల్లాలో మూడు, ఖమ్మంలో రెండు, నల్గొండ, వరంగల్, మెదక్‌లో ఒక్కో సీటును టీడీపీ నేతలు కోరుతున్నారు. మరోవైపు ఎవరెవరు సీట్లు ఆశిస్తున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో కూడా చంద్రబాబు అడిగి తెలుసుకోనున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పోటీ చేసే విషయంపైన కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పొత్తులు, సీట్ల సర్దుబాబు అంశాలను చంద్రబాబు టీ.టీడీపీ నేతలకే వదిలేశారు.కానీ ప్రచారానికి మాత్రం చంద్రబాబు రావాల్సిందిగా నేతలు కోరే అవకాశం ఉంది.అయితే చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారో అని నాయకులు ఉత్కంఠతతో ఉన్నట్లు తెలుస్తోంది.కానీ చంద్రబాబు మాత్రం ప్రచారానికి రావటానికి సుముఖంగా లేరని తెలుస్తుంది.బాలయ్యను ప్రచారానికి పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే బాలయ్యను స్టార్ కాంపైనర్ గా ప్రచారానికి రావాల్సిందిగా నేతలు కోరగా సానుకూలంగా స్పందించారు.