నేతలు మెచ్చిన నేత...

 

ప్రతిపక్షంలో ఉన్నా కానీ చంద్రబాబు పాలనపై అప్పుడప్పుడు కొంతమంది నేతలు పొగడ్తలు కురిపిస్తూనే ఉంటారు. ఆయన పరిపాలనా విధానం... ఆయన చేపట్టే కొన్ని పద్దతులు అందరికీ నచ్చటమే ఇందుకు కారణం. కేంద్ర మంత్రి ఉమా భారతి అయితేనేం... కాంగ్రెస్ మంత్రి జైరామ్ రమేష్ అయితేనేం అందరూ చంద్రబాబుకు కితాబు ఇచ్చినవాళ్లే. కాంగ్రెస్ నేతలు ఆయన తీరును తప్పు పట్టినా..చంద్రబాబు పరిపాలన మాత్రం మెచ్చుకోతగ్గదేనని.. తన వ్యక్తిగత అభిప్రాయం ఇదేనని జైరామ్ రమేష్ గతంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు.

 

దీనికి కారణం ఆయన ఇటీవల చేపట్టిన అవినీతి నిర్మూలన చర్యలే. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకు గాను.. చంద్రబాబు సర్కారు దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే 1100 కాల్ సెంటర్లు ప్రారంభించింది. దీంతో కాల్ సెంటర్ వల్ల ఆసక్తికరమైన ఫలితాలు వస్తున్నాయి. వేల సంఖ్యలో వారికి కాల్స్ వస్తున్నాయి. రేషన్ పెన్షన్, చంద్రన్న భీమా పధకం లభ్దిదారుల స్పందన తెలుసుకోడానికి ఈ కాల్ సెంటర్ నుంచి భారీగా ఫోన్ కాల్స్ చేస్తే అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఇలా 1100 కాల్ సెంటర్ పనితీరు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. ఇక దీనిపై కిరణ్ బేడీ కూడా స్పందించి "మినిమమ్ గవర్నమెంట్ మాగ్జిమమ్ గవర్నెస్" అంటూ  ట్వీట్ చేశారు. 1100 కాల్ నెంబర్ ద్వారా ఫిర్యాదులు తీసుకోవడం పరిష్కారం చూపడం చాలా బాగుందన్నారు. అంతేకాదు దీన్ని ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ట్యాగ్ చేశారు. మొత్తానికి సాంకేతికతను ఉపయోగించడంలో చంద్రబాబు ముందుంటారని మరోసారి నిరూపించారు.