సీఎంగానే మళ్లీ అడుగుపెడతా.. చంద్రబాబు శపథం.. అసెంబ్లీ బహిష్కరణ..
posted on Nov 19, 2021 11:52AM
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. వైసీపీ సభ్యులు చంద్రబాబు కుటుంబ సభ్యులపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంతో అధికార పక్షం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన ఫ్యామిలీ మెంబర్స్‌ను కించపరిచారంటూ ఒక దశలో కంట నీరు కూడా పెట్టారు. ఆ సమయంలో జగన్ వెకిలిగా నవ్వారని తెలుస్తోంది. తీవ్ర ఆవేదనతో మనస్తాపం చెందిన చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానంటూ చంద్రబాబు సభలోనే శపథం చేశారు. ఇది గౌరవ సభనా.. కౌరవ సభనా.. అంటూ మండిపడ్డారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తాను ఎన్నో అవమానాలు పడ్డానని.. ఇవాళ తన కుటుంబాన్ని, తన భార్యను అవహేళనగా మాట్లాడటం దుర్మార్గమంటూ.. సభను బహిష్కరించారు చంద్రబాబు.