చంద్రబాబుకి కోపం వచ్చింది... ఇక కష్టమే...

 

ప్రస్తుతానికైతే ఏపీలో టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నాయి. కానీ కొద్దిరోజుల నుండి ఈ పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి కూడా తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్నాంకదా అనో.. లేక ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని చోట్లా బీజేపీనే గెలుస్తుందన్న అహంభావనో తెలియదు కానీ... అక్కడి ప్రభావం ఇక్కడ చూపిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. ప్రతిపక్షంపై విమర్శలు గుప్పిస్తూనే.. మిత్రపక్షం అని కూడా చూడకుండానే... టీడీపీపై, టీడీపీ నేతలపై పదే పదే విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక బీజేపీ నేతలు విమర్శలకు టీడీపీ నేతలు కూడా అప్పుడప్పుడు స్పందిస్తున్నా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంతో కాస్త వెనక్కి తగ్గుతూ వస్తున్నారు. అయినా కానీ బీజేపీ నేతలు మాత్రం నోరు కంట్రోల్ లో పెట్టుకోకుండా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు.

 

మరోవైపు ఏపీ ప్రజలకు ఇప్పటికే ప్రత్యేక హోదా వల్ల...ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టడం వల్ల.. ఇంకా మోడీ ఏపీని చిన్నచూపు చూస్తుండటంవల్ల  బీజేపీపై వ్యతిరేకత ఏర్పడింది. దీంతో చంద్రబాబు కూడా ఎంత అడిగినా నిధుల సాయం చేయకపోవడం వల్ల అసంతృప్తితోనే ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో ఓపికగా ఉంటున్నా బీజేపీ నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు. అప్పటికీ మే నెల వరకూ గడవు తీసుకున్నారు. కానీ రెండు పార్టీల అప్పటివరకూ కూడా కలిసి ఉండే పరిస్థితులు కనిపించడంలేదు.

 

ఎందుకంటే టీడీపీపై బీజేపీ నేతల విమర్శలకు చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. బీజేపీ నేతలు మా నేతలను ఎంత విమర్శిస్తున్నా... బీజేపీతో మిత్రధర్మం పాటిస్తున్నాం కాబట్టి.. మా నేతలను చాలా వరకూ నియంత్రిస్తున్నా.. వాళ్లు వద్దనుకుంటే మాదారి మేం చూసుకుంటాం అని బహిరంగంగానే చెప్పారు. దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలకు దారితీశాయి. ఇంతవరకూ ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయని చంద్రబాబు.. ఇప్పుడు ఇంత ఖరాఖండిగా చెప్పారంటే దీని వెనుక రాజకీయ వ్యూహాం ఏదైనా ఉందా అని అనుకుంటున్నారు. లేక బీజేపీతో విసిగిపోయి ఉంటారు...అందుకే ఇలా మాట్లాడి ఉంటారు అని అనుకునే వాళ్లు కూడా ఉన్నారు.

 

ఏది ఏమైనా చంద్రబాబు ఇలా మాట్లాడటానికి వెనుక ఆయన మనసులో ఏముందో తెలియదు కానీ... ఆయన ఇలా మాట్లాడటం వల్ల ఏపీలో ఆయన పార్టీకి వచ్చే నష్టం అనేది ఏం లేదు. ఇంకా ఈ విషయంలో ఆలోచించుకోవాలంటే  బీజేపీ, ఆ పార్టీ నేతలు.. కేంద్ర పెద్దలే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఉన్న స్టామినా అందరికీ తెలిసిందే. ఏదో గత సార్వత్రిక ఎన్నికల్లో అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం... ఆ పార్టీలకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడంవల్ల కనీసం బీజేపీకి ఆ నాలుగు సీట్లైనా వచ్చాయి. ఏదో ఉత్తరాదిని చూసుకొని ఇక్కడ కాలర్ ఎగరేస్తే అది ఆపార్టీకే నష్టం. ఎందుకంటే అక్కడి పరిస్థితి వేరు.. ఇక్కడ పరిస్థితి వేరు.. అక్కడి రాజకీయాలు వేరు.. ఇక్కడి రాజకీయాలు వేరు. అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బీజేపీ కాస్త కంట్రోల్ లో ఉంటే వారికే బెటర్. అలా కాదని రెచ్చిపోతే వారికే నష్టం.. చంద్రబాబుకు వచ్చే నష్టం ఏం లేదు. మరి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం...