చైతన్యపురి మెట్రో స్టేషన్‌కు జప్తు నోటీసు

 

హైదరాబాద్‌లో చైతన్యపురి మెట్రో స్టేషన్‌కు విద్యుత్ శాఖ అధికారులు జప్తు నోటీసులు జారీ చేశారు. రూ. 31,829  కరెంట్ బకాయి ఉన్నట్లు విద్యుత్ సంస్థ పేర్కొంది. 2015 జులై 23వ తేదీన మెట్రో పనుల కోసం విద్యుత్తు కనెక్షన్‌ను మెస్సర్స్ థేల్స్ ఇండియా ప్రైవేటు ఏజెన్సీ తీసుకుంది. ఆ తర్వాత ఆ ఏజెన్సీ వెళ్లిపోయింది. 

2021 డిసెంబరు నాటికి బకాయి పడిన వినియోగదారుల నుంచి వసూలుకు టీజీ ఎస్పీడీసీఎల్ చర్యలు చేపట్టింది. మెట్రో కోసం పని చేసిన ఈ ఏజెన్సీ మెస్సర్స్ థేల్స్ చిరునామా, నంబరును గుర్తించడానికి జప్తు నోటీసును విద్యుత్ సంస్థ అధికారులు చైతన్యపురి మెట్రో రైలు స్టేషన్‌‌లో అంటించారు. విద్యుత్ కనెక్షన్‌కు రూ.31,829 బకాయిలు తీసుకున్న థేల్స్ కంపెనీ అడ్రస్ తెలియకపోవటంతో  జప్తు నోటీసును మెట్రో స్టేషన్‌కు ఇచ్చారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu