ప్రత్యేక సదుపాయాలకు కోర్టు నో.. గాలి సాధారణ ఖైదీయే!

ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదు అనడానికి మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఒక ఉదాహరణ. ఒకప్పుడు అపర కుబేరుడిగా వెలుగొందిన ఆయన ఇప్పుడు సాధారణ ఖైదీగా జైలు ఊచలు లెక్కిస్తున్నారు. గతంలో తన కుమార్తె వివాహాన్ని  నభూతో నభవిష్యత్ అన్నట్లుగా కోట్లు గుమ్మరించి అంగరంగ వైభవంగా చేశారు. ఆ సందర్భంగా ఆయన తన కుమార్తను  తల నుంచి కాళ్ల వరకూ వజ్రాభరణాలతో అలంకరించిన తీరు అప్పట్లో వార్తల పతాక శీర్షికల్లో నిలిచింది. అటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు మైనింగ్ అక్రమాల కేసులో దోషిగా చంచల్ గూడ జైల్లో కటకటాలు లెక్కిస్తున్నారు.  

మాజీమంత్రి గాలి జనార్థన్‌ రెడ్డి ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషిగా నిర్ధారణై చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఇదే కేసులో ఇప్పటికే  నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించినందున దానిని పరిగణనలోనికి తీసుకుని శిక్ష తగ్గించాలంటూ గాలి జనార్ధన్ రెడ్డి కోర్టును కోరినా ఫలితం లేకపోయింది. అదలా ఉంటే.. గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో ఆటోమేటిగ్గా ఆయన శాసనసభ సభ్యత్వం కూడా రద్దైపోయింది. 

ఇక ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి జైలులో తనకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. అయితే సీబీఐ కోర్టు ఆయన అభ్యర్థనను తోసి పుచ్చింది. నేరం రుజువై, దోషిగా నిర్ధారణ అయ్యి శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలూ కల్పించడం కుదరదని సీబీఐ కోర్టు స్ఫష్టం చేసింది. దీంతో గాలి జనార్ధన్ రెడ్డి చెంచల్ గూడ జైలులో సాధారణ ఖైదీగా మాత్రమే పరిగణించబడతారు. అంటే మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్ రెడ్డిని చెంచల్ గూడ జైలులోని ఇతర సాధారణ ఖైదీలాగానే ట్రీట్ చేస్తారు. సాధారణ ఖైదీ మాదిరిగానే ఆయన జైలు ఖైదీ యూనిఫారంనే ధరించాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలూ ఉండవు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఈ కేసులో శిక్ష పడిన ఆయన సమీప బంధువు శ్రీనివారెడ్డి, రాజ్ గోపాల్, అలీఖాన్ ను కూడా అదే జైలులో, అదే బ్యారక్ లో ఉన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu