కడప కోర్టు తీర్పుపై సుప్రీంకు బీటెక్ రవి

ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దంటూ కడప కోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టును ఇశ్రయించారు. ఈ మేరకు బీటెక్ రవి తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి, పత్రికా స్వేచ్ఛకు, భావప్రకటనా స్వేచ్ఛకు భగం వాటిల్లేలా ఉన్నాయని బీటెక్ రవి తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు బుధవారం (ఏప్రిల్ 24)న విచారణ జరపనున్నట్లు తెలిపింది.

 అవినాష్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ లో వివేకాహత్యకు సంబంధించి తనపై కేసులు ఉన్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే వైఎస్ వివేకా కుమార్తె సునీత కూడా సీబీఐ చార్జిషీట్ ఆధారంగా అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

చార్జిషీట్ లోని అంశాలను కూడా ప్రస్తావించకుండా కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇవ్వడంపై న్యాయనిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తారు. కడప కోర్టు ఉత్తర్వులపై సునీత కూడా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏ నిర్ణయం తీసకోనున్నదన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.