కేంద్ర మంత్రి గడ్కరీ నివాసానికి బాంబు బెదరింపు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదరింపు కాల్ వచ్చింది.ఆదివారం (ఆగస్టు 3) గుర్తు తెలియని అగంతకుడి నుంచి గడ్కరీ నివాసంలో బాబు పెట్టినట్లు ఫోన్ చేశాడు. ఈ ఫోన్ కాల్ తో పోలీసులు ఒక్కసారిగా ఉలక్కిపడ్డారు.   వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ గడ్కరీ నివాసంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చారు.

అయితే బెదరింపు కాల్ చేసిన అగంతకుడి ఆచూకీ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.   కాల్ వచ్చిన  ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ బృందాలు గంటల వ్యవధిలోనే బెదరింపు కాల్ చేసిన వ్యక్తి ఆచూకీ కనుగొన్నాయి. బెదరింపు కాల్ చేసిన నాగ్‌పూర్‌లోని తులసి బాగ్ రోడ్డులో ఉన్న ఓ మద్యం దుకాణంలో పనిచేస్తున్న ఉమేష్ విష్ణు రౌత్‌ను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu