తెలంగాణ బీజేపీ హెడ్ గా రామ‌చంద్ర‌రావు.. బాబు అనుకూలుడికి అధ్య‌క్ష పీఠ‌మా?

మొన్న‌టి వ‌ర‌కూ కిష‌న్ రెడ్డిని కేసీఆర్ ప్రోగా ఉండే బీజేపీ అధ్య‌క్షుడంటూ ఒక గొడ‌వ న‌డిచేది. అన్న‌ట్టుగానే బీజేపీ తెలంగాణ‌లో గ‌ట్టి పోటీ  ఇవ్వ‌లేక‌.. సెకండ్ ప్లేస్ టు థ‌ర్డ్ ప్లేస్ కి ప‌డిపోయింది  క‌మ‌లం పార్టీ.

క‌ట్ చేస్తే ఇప్పుడు రామ‌చంద్ర‌రావు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా ఎన్నిక  కాబోతున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న చంద్ర‌బాబుకు అనుకూలుడు కాబ‌ట్టి ఆయ‌న ఎన్నిక వెన‌క తెలుగుదేశం ఉందంటూ బీఆర్ఎస్ అప్పుడే మొద‌లు పెట్టేసింది. సోష‌ల్ మీడియాలో ఈ త‌ర‌హా పోస్టులు పెడుతూ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఇక్క‌డ బీఆర్ఎస్ గుర్తించాల్సింది  ఏంటంటే చంద్ర‌బాబుకు అనుకూలుడైన  రామ‌చంద్ర‌రావు ఉండ‌టం  కూడా ఒకందుకు పార్టీకి మంచిదే  క‌దా? వ‌చ్చే రోజుల్లో ఏపీకి  ఎన్డీయే కూట‌మి ఎలాగో స‌రిగ్గా అలాగే ఇక్క‌డ స్థానిక సంస్థ‌లు, గ్రేట‌ర్ ఎన్నిక‌లు, ఆపై 2023లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి వెస‌లుబాటు ఉంటుంది క‌దా? ఈ విష‌యం  ఎందుకు గుర్తించ‌డం లేదు? అన్న కామెంట్ వినిపిస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ జ‌న‌సేన, బీజేపీ కూట‌మి క‌ట్టి ఒక ఎన్నిక‌ల‌ను ఎదుర్కున్నాయి. కానీ ఏమంత స‌క్సెస్ ఫుల్ ఆప‌రేష‌న్ జ‌ర‌గ‌లేదు. క‌నీసం కూక‌ట్ ప‌ల్లి వంటి ఆంధ్ర ఓటు బ్యాంకు ఎక్కువ‌గా  ఉన్న  ఏరియాలో కూడా ఈ  బాండింగ్ రిజ‌ల్ట్ ఇవ్వ‌లేదు.

2024 ఎన్నిక‌ల్లో ఏపీలో కూట‌మి విజ‌య దుందుభి మోగించాక కూట‌మి కంటూ కొంత బ‌లం కనిపిస్తోంది. దాని ఫ‌లితాలు క్ర‌మంగా వ‌చ్చేలా తెలుస్తోంది. ఇప్ప‌టి  వ‌ర‌కూ బీజేపీ త‌న  పూర్తి సామ‌ర్ధ్యం క‌న‌బ‌ర‌చ‌లేక పోయింది. మొద‌ట నెట్  ప్రాక్టీస్ గా స్థానిక సంస్థ‌ల  నుంచి మొద‌లు పెడితే, అది గ్రేట‌ర్ త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కూ బండి లాగొచ్చు. అందుకు చంద్ర‌బాబుకు అనుకూల నేత ఉండ‌టం వ‌ల్ల ఆ పార్టీకి ఇంకా మేలు చేస్తుందే త‌ప్ప కీడు చేయ‌దు క‌దా? అన్న ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. మ‌రి బీఆర్ఎస్ చేస్తున్న ఈ ప్ర‌చారానికి కార‌ణ‌మేంటి?అంటే బీఆర్ఎస్ కి  అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ  విల‌న్ చంద్ర‌బాబే. చంద్ర‌బాబును బూచిగా  చూపించి నెగ్గుకు రావాల‌నే ప్ర‌య‌త్నిస్తోంది. త‌న పార్టీ పేరులోని తెలంగాణ సెంటిమెంటును తీసేశాక కూడా ఈ ధోర‌ణిలోంచి కారు పార్టీ బ‌య‌ట‌కు రావ‌డం లేద‌న్న‌మాట‌. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu