జేపీ నడ్డా కొత్త టీమ్‌లో డీకే అరుణ, పురందేశ్వరి

బీజేపీ జాతీయ కార్యవర్గంలో మార్పులు చేర్పులు జరిగాయి. నూతన కార్యవర్గాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. కొన్ని కీలక పదవుల నుంచి కొందర్ని తప్పించి, కొత్త వారికి చోటు కల్పించారు. ముఖ్యంగా రాష్ట్రాల్లో నాయకత్వాన్ని అభివృద్ధి చేసే దిశగా నియామకాలు చేపట్టారు. 

 

నూతన కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు కూడా సముచిత స్థానం లభించింది. తెలంగాణ నాయకురాలు డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి లభించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా డాక్టర్ రమణ్ సింగ్, ముకుల్ రాయ్, వసుంధరా రాజే, డీకే అరుణతో పాటు మొత్తం 12 మందిని నియమించారు. తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ను ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఏపీకి చెందిన సత్యకుమార్ కు జాతీయ కార్యదర్శి పదవి అప్పగించారు. అయితే, తెలుగునేతలు రామ్ మాధవ్, మురళీధర్ రావులను ప్రధాన కార్యదర్శుల బాధ్యతల నుంచి తప్పించారు.