బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్

గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న ఇంటి వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. రాజాసింగ్‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా పోలీసులు నిర్బంధించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో హిందువుల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని, ఇది మంచిది కాద‌న్నారు. బాధితుల‌పై రివ‌ర్స్ కేసులు పెట్ట‌డం దారుణ‌మ‌ని రాజాసింగ్ అన్నారు. ఇదే కేసులో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్టైన సంగతి తెలిసిందే .