ఫాంహౌజ్ లో కేసీఆర్ చేసేది ఇదే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడానికి ప్రతిపక్షాలు ఎక్కువగా వాడుకునేది ఫాంహౌజ్. కేసీఆర్ ను ఫాంహౌజ్ ముఖ్యమంత్రి అని విపక్ష నేతలు ఆరోపణలు చేస్తుంటారు. కేసీఆర్ ఎక్కువగా ప్రజల్లోకి తిరగరనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. ఉంటే ప్రగతి భవన్ లేదంటే ఫాంహౌజ్ లోనే ఆయన ఎక్కువగా ఉంటుంటారు. కొన్ని సార్లు రెండు, మూడు వారాల పాటు ఫాంహౌజ్ లోనే ఉంటారు కేసీఆర్. కరోనా సమయంలోనూ ఆయన ఎక్కువగా అక్కడే ఉన్నారు. అందుకే విపక్ష నేతలు ఆయనను టార్గెట్ చేయడానికి ఫాంహౌజ్ ను ఉపయోగించుకుంటూ ఉంటారు. 

అయితే వారాల తరబడి ఫాంహౌజ్ లో ఉండే కేసీఆర్.. అక్కడ ఏం చేస్తారని చాలా మందికి డౌట్. రెస్ట్ తీసుకుంటారని కొందరు చెబితే.. వ్యవసాయ పనులు చూసుకుంటారని మరికొందరు చెబుతారు. తాజాగా  తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. కేసీఆర్ ఫాంహౌజ్ స్టోరీ చెప్పారు. అక్కడే కేసీఆర్ ఏం చేస్తారో వివరించారు. సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపడానికి రంగం సిద్ధం చేస్తున్నామని అన్నారు. తాను జైలుకు పోతానని గ్రహించిన కేసీఆర్‌ ఇప్పటికే ఫామ్‌హౌస్‌లో జైలు జీవితం ప్రాక్టీస్‌ చేస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కేసీఆర్ స్పందించడం లేదన్నారు

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ గుర్రంబోడు తండా ఘనటలో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన 20 మంది బీజేపీ నాయకులను బండి సంజయ్ సన్మానించారు. ఈసందర్భంగా సంజయ్ ‌మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలకు కేసులు కొత్త కాదని, అలాగే జైలుకు పోవడం కూడా కొత్తకాదని సంజయ్‌ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. అన్నింటికీ సిద్ధమయ్యే వచ్చాం, . గుర్రం పోడుతండా ఘటనపై పోలీసుల తీరు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదుచేస్తామని చెప్పారు.  గుర్రంపోడు తండాలో బిజెపి కార్యకర్తలపై తగిలిన లాఠీదెబ్బలకు నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో బుద్ది చెబుతామని అన్నారు బండి సంజయ్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu