విభ‌జించాల‌న్నా, పేర్లు మార్చాల‌న్నా బిజేపీతోనే సాధ్యం!

కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అసల పేరు తెలుసా, భారాతీయ జనత పార్టీ కాదు భారతీయ గుజరాత్ పార్టీ గా కొత్త నామకరణం చేసారు విశ్లేషకులు. కేంద్రానికి దక్షిణ భారతదేశ రాష్ట్రాలపై ఎందుకు అంత వివక్ష, కేంద్రంలో ఏ పార్టీ అధికారం లో వున్నాకూడా దక్షిణ రాష్ట్రాలని వేదిస్తూనే వుంటారు. విభజన పేరుతొ రాష్ట్రాలలో అధికారం లోకి రావడానికి చూస్తున్నారు, అక్కడవున్న ఆదాయ వనరులని దోచుకోవ డం తప్ప ప్రజలకి చేసిన మేలు శూన్యం. మొన్న ఆంధ్రప్రదేశ్ ని రెండు గా విభజించారు  ఇప్పుడు తమిళనాడు. తమిళనాడుని రెండుగా విభజించే ఆలోచన కేంద్రానికి వుందా, బి జే పి నేతల మాటలకి అర్ధమేమిటి?

ఇప్పటికే ఆంద్ర ప్రదేశ్ ని రెండుగా విభజించి రెండు రాష్ట్రాలలో ప్రజల ఆగ్రహలకి  గురైన‌ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసి కూడా తమిళనాడు బి జే పి నేతలు ఈ వ్యాఖ్య‌లు  చేయడం గమనార్హం.కేంద్రం వివక్ష ఆపకపోతే ప్రత్యేక దేశం ఉద్యమం వస్తుందని డీఎంకే నేతలు హెచ్చరిస్తున్న సమయంలో బీజేపీ ఎదురు దాడి ప్రారంభించింది. తమిళనాడుని  రెండు రాష్ట్రాలుగా విభజించగలమని తమకు ఆ అధికారం ఉంద ని బీజేపీ నేతలు ప్రకటించారు. డీఎంకే నేతలకు కౌంటర్‌గా అంటున్నారా లేకపోతే నిజంగానే తమిళ నాడును విభజించే ఉద్దేశం ఉందా అన్నదానిపై ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే కాక దేశం మొత్తంలో  చర్చలు ప్రారంభమయ్యాయి. తమిళనాడుకు దేశంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు,చరిత్ర ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతమేకాకుండా, సంస్కృతిలోనూ, సంప్రదాయాలలోనూ, స్పష్టమైన తేడా ఉంది. తమిళ బాష పై వారు చూపే మక్కువ తక్కువ కాదు. 

ఇతర భాషల పై మోజు పెరిగితే ఎక్కడ తమ బాషకి ఇబ్బంది అవుతుందోనని హిందీ లాంటి జాతీయ భాష లపై కూడా వ్యతిరేకత చూపిస్తూ ఉంటారు. ఈ హిందీ వ్యతిరేకత బీజేపీ వంటి కొన్ని జాతీయ పార్టీలకు ఏ మాత్రం నచ్చడం లేదు. అందుకే దక్షిణభారత దేశం లో బలపడలేకపోతున్నామన్న భావన ఆ పార్టీ నాయకులలో బలంగా ఉంది. అర్దరాత్రి ఒప్పందం తో తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్ విడగొట్టిన తర్వాత తెలంగాణలో బీజేపీ పుంజుకుంది.తెలంగాణా లో అధికారం దిశగా ప్రస్తుతం పావులు కదుపుతోంది, ఈ కారణంగా తమిళనాడునూ విభజిస్తే ఎంతో కొంత పార్టీకి మేలు జరుగుతుందని ఆశిస్తే,ఆలోచనని మొక్క లో ఉన్నపుడే అడ్డుకోలేక‌పోతే,  తమిళనాడు ఇంకో ఆంధ్ర ప్రదేశ్ లా మారుతుంద‌ని  నిపుణుల అంచనా. 

ఈ  విషయంలో కాంగ్రెస్ లాగానే బీజేపీకి దయాదాక్షిణ్యాలు ఉండవని గతంలోనే తేలిపోయింది. అయితే ఇప్పుడు బీజేపీ నాటకాలకి  తమిళ ప్రజలు పడతారా, ప్రాంతీయంగా విడిపోతారా లేఖ మళ్లీ తమ  సమైక్య‌ తని చూపుతారా అన్నది వేచి చూడాలి. ఇప్పటికి  ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి  దేశం మొత్తం చూస్తూనే వుంది.దేశానికీ ప్రధాన ఆదాయ వనరులు దక్షిణాది  రాష్టాలు అని నిపుణుల  విశ్లేషణ, వాటి ఆదయ ములాలపై దెబ్బకొట్టడానికే కేంద్ర ప్రభుత్వ కుతంత్ర ఆలోచన.కేంద్రం లో దక్షిణాది రాష్ట్రాల నాయకుల అదిపత్యాన్ని ఓర్వలేని  భారతీయ గుజరాత్ పార్టీ నాయకులూ ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు.విభజించి పాలించు అనే తెల్లవాడి నినాదం తో కేంద్ర ప్రభుత్వాలు పాలన చేస్తుండడం గమనార్హం. అప్పట్లో తెల్లవాడు చేస్తే,ఇప్పుడు ఉత్తరాది నాయకులూ  చేస్తున్నారు.