వైసీపీది రాక్షస రాజకీయం.. చింతమనేని నిప్పులు

టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌ శివారులో కోడి పందాలు నిర్వహిస్తూ.. పోలీసులు చేసిన దాడిలో చిక్క కుండా వారి కళ్లు గప్పి చింతమనేని ప్రభాకర్‌ పరార్‌’ అంటూ మీడియాలో వచ్చిన వార్తలపై చింతమనేని ఘాటుగా స్పందించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు మండలం చిన్నకంజర్లలోని  ఓ ఫాంహౌస్‌ పై బుధవారం రాత్రి పోలీసులు దాడిచేసి కోడిపందెం రాయుళ్లను పట్టుకున్నట్లు  మీడియా లోవార్తలు వచ్చాయి. ఈ దాడిలో పోలీసులకు 22 మంది దొరికారని, 25 వాహనాలు, 13 లక్షల 12 వేల పైచిలుకు నగదు, 31 పందెంకోళ్లు, 31 కోడి కత్తులు లభ్యమయ్యాయంటూ మీడియాలో వార్త వచ్చింది.

అయితే.. ఇదంతా వైసీపీ ప్రభుత్వం రాక్షస రాజకీయం అంటూ చింతమనేని ప్రభాకర్‌ తన ఫేస్‌ బుక్‌ పేజీలో పోస్టు పెట్టారు. ఈ దుర్మార్గపు నీచమైన ప్రచారం ఇకనైనా ఆపండి అన్నారు. కోడి పందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్లు చూపటం మీ జెండా.. అజెండా అంటూ నిప్పులు చెరిగారు. ఇంత రాక్షస రాజకీయం అవసరమా? అంటూ చింతమనేని ప్రశ్నించారు. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోండి  అంటూ చింతమనేని సవాల్‌ విసిరారు. అంతే కానీ.. ఈ దుర్మార్గపు, నీచమైన ప్రచారం ఇకనైనా ఆపండి అంటూ ఆయన నిప్పులు చెరిగారు. నీచమైన ఇలాంటి ప్రచారంతోనే తెలుగు ప్రజల్లో కుప్పకూలే మేడలు కట్టి, వారిలో విష బీజాలు నాటి.. నాడు అధికారంలోకి వచ్చారని చింతమనేని విమర్శించారు. ఆ మేడ కూలి పోయే సమయం ఆసన్నమైందని ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. మీ అసత్యాల సాక్షిని ప్రజలు కూకటి వేళ్లతో ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమైందని చింతమనేని హెచ్చరించారు. ఆ రోజు కోసమే తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ తన ఫేస్‌ బుక్‌ పేజీలో చింతమనేని ప్రభాకర్‌ పేర్కొన్నారు. మీ రాక్షస రాజకీ య వికటాట్టహాసానికి, మీ సాక్షికి ముగింపు త్వరలోనే.. అంటూ చింతమనేని కామెంట్‌ పెట్టారు.

నిజానికి ఏపీలో వైఎస్ జగన్‌ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ ప్రతిపక్ష టీడీపీ నేతలను ఏదో విధంగా ఇబ్బందులు పెడుతూనే ఉంది. ఆనాడు టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత కింజరాపు అచ్చెన్నాయుడు మొదలు, మొన్నటి కొల్లు రవీంద్ర నుంచి నిన్నటి చింతకాయల అయ్యన్న పాత్రుడి వరకూ రకరకాల కేసులు, ఇబ్బందులు పెడుతూనే ఉంది. వేధిస్తూనే ఉంది. గతంలో కూడా చింతమనేని ప్రభాకర్‌ పై పలుమార్లు కేసులు పెట్టింది. తాజాగా తెలంగాణలో కోడిపందాలు నిర్వహిస్తు న్నారంటూ చింతమనేనిపై వైసీపీ మీడియా దుష్ప్రచారం చేయడంపై టీడీపీ నేతలు దుమ్మెత్తి పోస్తు న్నారు.