బిహార్ ఎన్నికల సర్వే... గెలుపు ఎవరిదంటే?
posted on Oct 6, 2025 7:05PM

బిహార్‌లో ఎన్డీయే కుటమి ఘన విజయం సాధిస్తుందని మ్యాటిజ్-ఐఎఎఎన్ఎస్ పబ్లిక్ ఒపినియన్ పోల్‌లో వెల్లడైంది. ఎన్డీయే కూటమి బీజేపీ, జేడీయూకి 150-160 సీట్లు గెలిచి అధికారన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని సర్వేపోల్ వెల్లడించింది. మహాఘట్‌బంధన్ ఆర్జేడీ, కాంగ్రెస్, లెప్ట్ పార్టీలు 70-85 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఎన్డీయేకి 49%, మహాఘట్‌బంధన్ 36% ఓట్లు పోలవుతాయని తెలిపింది. ప్రశాంత్ కిశోర్, జన్ సూరజ్ పార్టీకి 2-5 సీట్లు వస్తాయని వివరించింది. బీజేపీ 80-85, జేడీయూ 60-65 సీట్లు గెలుచుకోవచ్చు అని అంచన వేస్తున్నారు. ఆర్జేడీకి 60-65, కాంగ్రెస్‌కి 15-20 అసెంబ్లీ సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని ఒపినియన్ పోల్ తెలిపింది.
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయేను వీడి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో మహాగఠ్‌బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మరోసారి నీతీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.